• Login / Register
  • RahulGandhi | తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం అవుతుంది:

    RahulGandhi | తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం అవుతుంది: 
    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ
    సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉన్నాం :  సీఎం రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం 

    Hyderabad :  తెలంగాణ  రాష్ట్రంలో  బుధ‌వారం (ఈ నెల 6  ) నుంచి చేపట్టనున్న కులగణన ప్రక్రియ దేశానికి రోల్‌ మోడల్‌గా మారుతుందన్నారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కులగణన ద్వారా దేశంలో ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. తెలంగాణలో చేపట్టనున్న కులగణన ప్రక్రియ దేశానికి రోల్‌ మోడల్‌గా మారుతుందని కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీని ద్వారా దేశ అభివృద్ధి, రాజకీయ స్థితిగతులు మారతాయన్నారు. కుల గణన ద్వారా అభివృద్ధి ఫలాలు వారికి ఏ విధంగా అందించవచ్చనే అంశంపై స్పష్టత వస్తుందని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, కొందరు ఈ వాస్తవాలు బయటకు రావొద్దని భావిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటివరకు కులవివక్షపై ఎందుకు మాట్లాడలేదని రాహుల్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కువ అసమానతులు కలిగిన దేశంగా భారత్ ఉందన్నారు. కుల వివక్ష ఉన్న దగ్గర అసమానతలు మరింత ఎక్కువగా ఉంటాయని అన్నారు. దేశంలోని పలు వ్యవస్థలు, కంపెనీల్లో ఎంతమంది దళితులు, బీసీలు ఉన్నారని, ఆ వివరాలు అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారు అని ప్ర‌శ్నించారు. వీటిని అడ్డుకునే వాళ్లు వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని చూస్తున్న‌ట్లు తెలిపారు. 
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం రాహుల్ గాంధీ హైదరాబాద్ లో పర్యటించారు. బోయిన్‌పల్లి ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నేతలతో మాట్లాడటంతో పాటు కులగణన ప్రాధాన్యత గురించి రాహుల్‌గాంధీ వివరించారు. కులగణనను సమగ్రంగా జరిపించే బాధ్యతను తాము తీసుకుంటామని రాహుల్ గాంధీ ఈ సంద‌ర్భంగా స్పష్టంచేశారు. 
    *సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం: రేవంత్ రెడ్డి
    తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని రాష్ట్ర‌ సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అలాగే  కులగణనను సమగ్రంగా జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షలు సమర్థంగా నిర్వహించామని గుర్తు చేశారు. అందులో ఎక్కువ మంది ఓబీసీ అభ్యర్థులే ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2025లో కేంద్రం జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేసిన‌ట్లు సీఎం రేవంత్ ప్ర‌క‌టించారు. 
    *  *  *

    Leave A Comment